Telugu News » Oyo Rooms: ‘ఓయో’ బుకింగ్స్‌.. టాప్ ప్లేస్‌లో హైదరాబాద్..!

Oyo Rooms: ‘ఓయో’ బుకింగ్స్‌.. టాప్ ప్లేస్‌లో హైదరాబాద్..!

ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్(Hospitality tech platform) ఓయో ట్రావెలోపీడియా-2023(Travelopedia) పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో బెంగళూరు నిలిచింది.

by Mano
Oyo Rooms: 'Oyo' bookings.. Hyderabad in the top place.. !

దేశవ్యాప్తంగా ఓయో హోటల్(Oyo Hotel) బుకింగ్స్‌(Bookings)లో హైదరాబాద్(Hyderabad) టాప్ ప్లేస్‌(Top Place)లో నిలిచింది. ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్(Hospitality tech platform) ఓయో ట్రావెలోపీడియా-2023(Travelopedia) పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.

Oyo Rooms: 'Oyo' bookings.. Hyderabad in the top place.. !

ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో బెంగళూరు నిలిచింది. అదే విధంగా ఢిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరి మొదటి స్థానంలో ఉండగా వారణాసి, అమృత్‌సర్, హరిద్వార్ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా గోరఖ్‌పూర్, దిఘా, వరంగల్, గుంటూర్ వంటి నగరాలు కూడా కిందటేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ రూమ్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓయో ప్రకటించింది.

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఓయో నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 30న అత్యధిక బుకింగ్స్ నమోదయినట్లు నివేదికలో తెలిపారు. అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నెలగా మే నెల నిలిచింది. ఇతర లాంగ్ వీకెండ్లతో పోలిస్తే సెప్టెంబర్ 30 అక్టోబర్ 2 మధ్య లాంగ్ వీకెండ్ అత్యధిక రూమ్స్ బుక్ అయినట్లు ఓయో వెల్లడించింది.

You may also like

Leave a Comment