Telugu News » Telangana : నల్ల కోటు వేసుకొన్న కీచక అడ్వకేట్.. మహిళా మెజిస్ట్రేట్‌ పై..?

Telangana : నల్ల కోటు వేసుకొన్న కీచక అడ్వకేట్.. మహిళా మెజిస్ట్రేట్‌ పై..?

బార్ కౌన్సిల్ హెచ్చరికలు పెడచెవిన పెట్టిన శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీచేసింది.. కాగా ఈ ఉదంతంపై హైకోర్టులో విచారణ జరిపిన అనంతరం.. కేసుని సుమోటోగా హైకోర్టు స్వీకరించింది.

by Venu
Petition in High Court to Postpone Group 2 Exam

నేటి సమాజంలో న్యాయాన్ని రక్షించే వారికి రక్షణ లేకుండా పోతోంది. అదీగాక లోకంలో ఆడవారుగా పుట్టడమే శాపంగా భావిస్తోన్న కొందరి ప్రవర్తన వల్ల.. న్యాయదేవత సైతం.. ప్రాణం ఉంటే.. ప్రస్తుతం జరుగుతోన్న ఆరాచకాలని చూసి శోకించేది కావచ్చు.. కామానికి కాదేది అడ్డు అన్నట్టు.. ఖాకీ డ్రెస్, నల్ల కోటు వంటివి వేసుకుని.. సమాజం గర్వపడే వృత్తిలో ఉన్న వారు సైతం ఆడవారి పట్ల వెకిలి చేష్టలు చేయడం సమాజానికి హానికరం అన్న విషయాన్ని గమనించాలని హితవు చెబుతోన్నారు కొందరు..

ఇక తెలంగాణ (Telangana)లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఏకంగా మహిళ జడ్జిని వేధింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. రంగారెడ్డి కోర్టు (Rangareddy Court)లో మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ న్యాయమూర్తి (Woman Judge)ని.. అదే కోర్టులో అడ్వకేట్ (Advocate)గా పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నిత్యం వేధించడంతో.. ఈ వ్యవహారంపై మహిళా న్యాయమూర్తి స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్టు సమాచారం..

అయినా ఆ కీచక అడ్వకేట్, శ్రీనివాస్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. మరింత ఉషారుగా.. తన వృత్తిని మరచి ప్రవర్తించినట్టు ఆ మహిళా న్యాయవాది గమనించింది. అంతటితో ఆగని ఆ అడ్వకేట్.. మహిళ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లోనూ తిరుగుతూ కనిపించాడు. ఇక అతని చర్యలని సీరియస్ గా తీసుకొన్న మహిళా న్యాయమూర్తి.. అడ్వకేట్, శ్రీనివాస్ ని పిలిచి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే అతడి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ విషయం తెలంగాణ బార్ కౌన్సిల్ దృష్టికి వెళ్లడంతో.. బార్ కౌన్సిల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు బార్ కౌన్సిల్ హెచ్చరికలు పెడచెవిన పెట్టిన శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీచేసింది.. కాగా ఈ ఉదంతంపై హైకోర్టులో విచారణ జరిపిన అనంతరం.. కేసుని సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. సదరు న్యాయవాదిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. అతనిపై తీసుకున్న చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

You may also like

Leave a Comment