కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన మొత్తం 34 మందిని పద్మశ్రీ (Padma Awards) పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపింది. రాష్ట్రం నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది.
చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప, గ్రంథాలయ ఉద్యమకారుడు కూరెళ్ల విఠలాచార్య, స్థపతి వేలు ఆనందాచారి, భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత్ సోమ్లాల్‌కు ఈ పురస్కారాలు వరించాయి.
మరోవైపు కొణిదెల చిరంజీవి, ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు, (AP), వైజయంతిమాల, పద్మ సుబ్రహ్మణ్యం (Tamilanadu), సామాజిక సేవకుగానూ బీహార్ కు చెందిన బిందేశ్వర పాఠక్ రెండో అత్యున్నత పురస్కారం వరించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించారు. వీటిలో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురిని పద్మశ్రీ వరించింది.
అలాగే, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీ వరించింది. దేశంలోని తొలి మహిళా మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్‌లకి ఈ అవార్డును ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆరు పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్. 91 పద్మశ్రీ అవార్డులున్నాయి.