Pakistan: భారత 77 వ స్వాతంత్య్ర దినోత్సవాలు విదేశాల్లో ఘనంగా జరిగాయి. అయితే ముఖ్యంగా దుబాయ్ (Dubai) లోనిఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ (Pakistan) జాతీయ పతాకంకనబడకపోవడం ఆ దేశస్థులకు తీవ్రఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. భారత, పాకిస్తాన్ దేశాల ఇండిపెండెన్స్ డే ఒకటే కావడం విశేషం. శనివారం రాత్రి బుర్జ్ ఖలీఫాపై కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య భారత జాతీయ జెండా కనబడడం, అదే సమయంలో తమ దేశ పతాకం కనబడకపోవడంతో వారు షాక్ తిన్నారు. నిజానికి గత అర్ధరాత్రి వందలాది మంది పాకిస్తానీయులు ఇక్కడికి చేరుకున్నారు.
అర్ధరాత్రి గడిచిపోయినా తమ దేశ జెండా కనబడకపోవడంతో వారు ఆగ్రహం చెందిన వైనాన్ని పాక్ యు ట్యూబ్ ఛానల్ కు చెందిన సనా అంజాద్ వీడియోగా షేర్ చేశారు. . ప్రపంచంలోనే ఎత్తయిన ఈ కట్టడంపై మా దేశ జెండా కనబడకపోవడం మమ్మల్ని అవమానించినట్టే అని దుబాయ్ లోని పాకిస్తానీలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే చాలామంది ఈ కట్టడం దగ్గరి నుంచి నిరాశతో వెనుదిరిగారు. తమ దేశం తన ఔన్నత్యాన్ని కోల్పోతోందని వారు వ్యాఖ్యానించారు. భారత ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని బుర్జ్ ఖలీఫా ఆ దేశ ప్రజలకు శుభా కాంక్షలు కూడా తెలిపిందన్నారు. ఇండియా అంటే దుబాయ్ కి ఎంతో అభిమానం ఉందని, కానీ మా దేశ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా మాకీ అవమానం జరిగినట్టు భావిస్తున్నామని వారన్నారు. కేవలం ఈ ఉదంతమే కాదు.. భారత ప్రధాని మోడీ సందేశాన్ని కూడా రెగ్యులర్ గా బుర్జ్ ఖలీఫా డిస్ ప్లే చేస్తుందని పేర్కొన్నారు. అయితే భారత సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా చాలామంది మీమ్ లతో సహా వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. పాకిస్తాన్ ను బుర్జ్ ఖలీఫా తిరస్కరించి ‘మొట్టికాయ’ వేసిందని అంటూ ఈ కట్టడం వద్ద వారు వేచి ఉన్న వీడియోలను పలువురు షేర్ చేశారు.
చివరకు బుర్జ్ ఖలీఫా తన ఇన్స్ టాగ్రామ్ లో.. పాక్ జాతీయ పతాకాన్ని, ఇండిపెండెన్స్ డే మెసేజ్ ని డిస్ ప్లే చేసింది. కానీ శుభా కాక్షాల మెసేజ్ లో .. పాక్ 76 వ ఇండిపెండెన్స్ డే’ గా పేర్కొన్నారు. ఇది మరో వివాదానికి దారి తీసింది. ఇది గత సంవత్సరపు వీడియో అయి ఉండవచ్చునని చాలామంది పెదవి విరిచారు.
జాతీయ జెండా ఎగురవేసిన పాక్ ప్రెసిడెంట్
తమ దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఇస్లామాబాద్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ప్రపంచ దేశాల నేతల శుభాకాంక్షలు
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ .. ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ .. భారత, అమెరికా దేశాల మధ్య గల పటిష్టమైన సంబంధాలను గుర్తు చేశారు. యుఎస్ మిలిటరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించింది.
.
ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, నేపాల్, భూటాన్ ప్రధానులు .. భారత ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. బహరైన్, నార్త్, సౌత్ కొరియా దేశాలతో బాటు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కూడా ఇండియాకు శుభాకాంక్షల సందేశాన్నిపంపింది.