Telugu News » నెలసరి టైం లో బొప్పాయి, పైనాపిల్ తినకూడదా..? తింటే ఏం అవుతుంది..?

నెలసరి టైం లో బొప్పాయి, పైనాపిల్ తినకూడదా..? తింటే ఏం అవుతుంది..?

by Sravya

మహిళలకి పీరియడ్ సమయంలో అనేక సమస్యలు వస్తాయి. కడుపునొప్పి మొదలు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నెలసరి విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏమైనా సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. రెగ్యులర్ గా మహిళలకి పీరియడ్స్ వస్తూ ఉండాలి. పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు వచ్చినా లేదంటే పీరియడ్స్ విషయంలో ఆలస్యం వంటివి జరిగినా కూడా డాక్టర్ని సంప్రదించాలి. అలానే మహిళలు కొన్ని కొన్ని ఆహార పదార్థాలను పీరియడ్స్ సమయంలో తినకూడదని అంటూ ఉంటారు.

కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అధికంగా రక్తస్రావం అవుతుందని అంటారు. బొప్పాయి, పైనాపిల్, నువ్వులు, గోంగూర వంటివి అసలు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. బొప్పాయి పైనాపిల్ పీరియడ్స్ సమయంలో మహిళలు తీసుకుకూడదనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. పీరియడ్స్ సమయంలో బొప్పాయి పైనాపిల్ తినకూడదని చెప్పడం వెనక ఆధారాలు అయితే లేవు. పీరియడ్స్ సమయంలో ఇవన్నీ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు తప్ప వీటి వలన నష్టం కలుగుతుందని ఎక్కడ చెప్పలేదు.

Also read:

ఒకవేళ కనుక వీటిని తింటే రక్తస్రావం అధికంగా అవుతున్నట్లు అనిపించినట్లయితే, మితంగా మాత్రమే తీసుకోండి. అంతేకానీ మానేయాల్సిన అవసరం లేదు. పీరియడ్ సమయంలో మలబద్ధకం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఉపశమనం కలగడానికి నువ్వులు, బొప్పాయి, పైనాపిల్ తీసుకుంటే మంచిది. నెలసరి రావడానికి వారం ముందు వీటిని తీసుకుంటే మరింత మంచి కలుగుతుంది పైగా వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో తీసుకోవచ్చు తప్పులేదు.

 

You may also like

Leave a Comment