Telugu News » Cyber criminal : అమాయకులే టార్గెట్…6 నెలల్లో రూ.కోట్లు మింగేసిన సైబర్ తిమింగలం!!

Cyber criminal : అమాయకులే టార్గెట్…6 నెలల్లో రూ.కోట్లు మింగేసిన సైబర్ తిమింగలం!!

పోయిన చోటే వెతుక్కోవాలట..వ్యాపారంలో దెబ్బతిన్నాడు.తిన్నవాడు తిన్నట్టు ఉండిపోలేదు.ఆ నష్టాన్ని నమ్మిన వాళ్లనుంచి భర్తీ చేసుకోవాలనుకున్నాడు.

by sai krishna

పోయిన చోటే వెతుక్కోవాలట..వ్యాపారంలో దెబ్బతిన్నాడు.తిన్నవాడు తిన్నట్టు ఉండిపోలేదు.ఆ నష్టాన్ని నమ్మిన వాళ్లనుంచి భర్తీ చేసుకోవాలనుకున్నాడు. నిరుద్యోగులు, గృహిణులే లక్ష్యంగా..పెట్టుబడుల పేరిట దొరికినవాళ్లని దొరికినట్టు ముంచేశాడు.

ఒక టెక్కీ ఇచ్చిన కంప్లైంట్ చివరికి పోలీసులకు చిక్కాడు వివరాల్లోకి వెళితే…ముంబయికి చెందిన రోనక్‌ భరత్‌ కుమార్‌ కక్కడ్‌..డిజిటల్‌ మార్కెటింగ్‌(Digital marketing)లో శిక్షణ తీసుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు.

వివిధ సంస్థల నుంచి ప్రకటనలు సేకరించి..వాటిని గూగుల్, సామాజిక మాధ్యమాలకు ఇచ్చి కమీషన్‌ తీసుకునేవాడు. వ్యాపార నిర్వహణకు. బ్లాక్‌ వే డిజిటల్, రొలైట్‌ మార్కెట్‌(Rolight Market) పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వాటి ద్వారానే ఆర్థిక లావాదేవీలు చేసేవాడు.

వ్యాపారంలో ఆశించినంత లాభాలు రాకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం టెలిగ్రామ్‌ యాప్‌లో వెతికాడు. అందులో తైవాన్‌(Taiwan)కు చెందిన స్వాంగ్‌లిన్(Swanglin),యూరప్‌(Europe)వ్యాపారి ఇరీన్‌లకి పరిచయమయ్యాడు.

దేశంలో నిర్వహించే వ్యాపారాల్లో భారీగా నగదు జమ అవుతుందని.. లావాదేవీలకు అవసరమైన బ్యాంకు ఖాతాలను ఇప్పించాలని కోరాడు. వారి వ్యాపారాల గురించి భరత్‌ ఆరాతీయగా వాస్తవాలు దాచి మోసంచేసే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు.

పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట చైనీయులు చేసే మోసాల గురించి..తనకు తెలుసంటూ వారి ద్వారానే అక్రమదందాల గుట్టు తెలుసుకున్నాడు.తనకు అనువుగా మలచుకొని పెద్దఎత్తున లాభపడ్డాడు.


సామాజిక మాద్యమాల ద్వారా లింకులు పంపి దేశవ్యాప్తంగా..కేవలం 6 నెలల్లోనే రూ. 500 కోట్లకు పైగా కొట్టేసి చైనాకు తరలించాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు(Cyber Crime Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా భరత్ వ్యవహారం బహిర్గతమైంది.

ఈ నెల 12న నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మూడ్రోజుల పాటు కస్టడీకి తీసుకొని సేకరించిన వాంగ్మూలంలో విస్తుపోయే వాస్తవాలు వెలగులోకి వచ్చాయి.

ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట బాధితులనుంచి బ్యాంకు ఖాతాలకు జమయ్యే నగదును క్రిప్టోగా మార్చి అందిస్తానని..అందుకు ప్రతిఫలంగా 20శాతం కమీషన్‌ ఇచ్చేలా ఒప్పందంకుదర్చుకున్నాడు.

దుబాయ్‌లో ఉంటున్న మిత్రుడు ప్రశాంత్‌కి ఆ విషయం చెప్పాడు. వచ్చే కమీషన్‌లో.. చెరిసగం పంచుకుందామంటూ ఆశచూపాడు. దుబాయ్‌లోని భారతీయుల బ్యాంకు ఖాతాలను సేకరించి వాటి ద్వారా భారతీయ కరెన్సీను దినార్లుగా మార్చి అంతే మొత్తం వారి ఖాతాల్లోనే జమచేసేవారు.

ఈ విధంగా సహకరించిన బ్యాంకు ఖాతాదారులకు ప్రశాంత్‌ ఉచితంగా విదేశీనగదు మార్పిడి సేవలు అందించేవాడు. దీంతో అక్కడి భారతీయులు తమ ఖాతాలను మిత్రుల చేతికిచ్చేవారు.

అక్రమ లావాదేవీలకు సుమారు 100 ఖాతాలు ఉపయోగించినట్లు.. సైబర్‌క్రైమ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల్లో జరిగే ఆన్‌లైన్‌ లావాదేవీలన్నీ భరత్‌కుమార్‌ ముంబయి నుంచే పర్యవేక్షించేవాడు.

మాయమాటలు చెప్పి కొందరు ఖాతాదారులతోనే నగదు డిపాజిట్, బదిలీ ప్రక్రియ చేయించేవాడని గుర్తించారు. ముంబయిలో భరత్‌కుమార్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా మరికొందరి ఆచూకీని పోలీసులు గుర్తించారు.

You may also like

Leave a Comment