Telugu News » High Court: ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..!

High Court: ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..!

సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.

by Mano
High Court: Telangana High Court notices to AP CM Jagan..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Former MP Harirama Jogaiah) వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ చేపట్టింది.

High Court: Telangana High Court notices to AP CM Jagan..!

సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

You may also like

Leave a Comment