ఏపీ (AP)లో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో జనసేన (Janasena) అధినేత సైతం ప్రచార పర్వానికి తెర తీశారు. ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డైలీ బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు తాను పోటీ చేస్తోన్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు..

కాగా పవన్ తెనాలి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఇక ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్.. బుధవారం సుమారు 20 కి.మీ వరకు ఎండలో పాదయాత్ర చేయడం వల్ల ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ (TDP) ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు దక్కాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ప్రచార బాధ్యతల్ని సైతం నిర్వహిస్తున్నారు..