Telugu News » Pawan Khera : పొత్తుల్లేవ్.. సింగిల్ గానే అధికారంలోకి వస్తాం!

Pawan Khera : పొత్తుల్లేవ్.. సింగిల్ గానే అధికారంలోకి వస్తాం!

భారత్ జోడో రెండో విడత యాత్రపై చర్చ జరిగిందన్న పవన్ ఖేరా.. దానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చరిత్ర చాలా ఉందని అన్నారు. 1989లోనే రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.

by admin
pawan khera on telangana politics

సీడబ్ల్యూసీ (CWC) రెండోరోజు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు హస్తం నేతలు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్ పై చర్చించారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సిఎల్పీ లీడర్లు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. తెలంగాణలో సోమవారం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది కాంగ్రెస్ (Congress). ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. 119 నియోజకవర్గాలకు ఇంచార్జ్ ల నియమించిన పార్టీ.. వారి వివరాలను వెల్లడించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Kharge) ఈ లిస్ట్ ను విడుదల చేశారు.

pawan khera on telangana politics

సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా (Pawan Khera) మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిన మార్గాన్ని సూచించిందన్నారు. భరతమాత కష్టాలను యాత్ర ప్రతిధ్వనించిందని.. దాని ఆధారంగానే కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీలను రూపొందించామని తెలిపారు. బీజేపీ (BJP) అసంబద్ధ అంశాల ట్రాప్‌ లో పడొద్దని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమను హెచ్చరించారుని.. ఆయన నుంచి శనివారం పార్టీకి, కార్యకర్తలకు స్పష్టత వచ్చిందన్నారు.

భారత్ జోడో రెండో విడత యాత్రపై చర్చ జరిగిందన్న పవన్ ఖేరా.. దానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చరిత్ర చాలా ఉందని అన్నారు. 1989లోనే రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. పలుమార్లు ఉభయ సభల ముందుకు వచ్చినా ఆమోదం పొందలేదని.. మన్మోహన్ సింగ్ హయాంలో రాజ్యసభలో బిల్లు పాసై లైవ్​ గా ఉందని చెప్పారు. ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని సీడబ్ల్యూసీ తీర్మానించిందని వెల్లడించారు.

ఇక, తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. సొంతంగానే తగినంత సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఏ పార్టీ నుంచి సహకారం అవసరం లేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సొంతంగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఏ మాత్రం సందేహం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓవైపు వామపక్షాలతో పొత్తులు ఉంటాయని వార్తలు వస్తున్న ఈ తరుణంలో పవన్ ఖేరా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

You may also like

Leave a Comment