Telugu News » Tirupathi: ‘పిల్లలూ…మరుగుదొడ్డి క్లీన్ చేయండి’ తిరుపతిలో ఉపాధ్యాయుల  తీరు ఇది !

Tirupathi: ‘పిల్లలూ…మరుగుదొడ్డి క్లీన్ చేయండి’ తిరుపతిలో ఉపాధ్యాయుల  తీరు ఇది !

అంజూరు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల కోసం పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉంది.

by Prasanna
toilets

స్కూల్ కి వెళ్తే పాఠాలు చెప్తారు, ఆటపాడలాడిస్తారు. కానీ తిరుపతి (Tirupathi) లో మాత్రం చదువుకునేందుకు వచ్చిన పిల్లలతో మరుగుదొడ్డి (Toilet) శుభ్రం చేయిస్తున్నారు. అది కూడా చేతులతో శుభ్రం చేయమని హుకుం జారీ చేస్తున్నారు. పిల్లలు (Students) స్కూల్ టాయిలెట్ క్లీన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలం అంజూరు ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

toilets

అంజూరు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల కోసం పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉంది. దీనిని ఇక్కడి విద్యార్థులంతా ఉపయోగిస్తారు. దీనిని విద్యార్థులతోనే ప్రతిరోజూ ఉపాధ్యాయులు శుభ్రం చేయిస్తున్నారు. పైగా విద్యార్థులు చేతులతోనే శుభ్రం చేస్తున్నారు. ఇదంతా చూసిన స్థానికులు కొందరు… పిల్లలు టాయిలెట్ క్లీన్ చేయడం ఫోటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ విషయం బయటపడింది.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు చదువులు చెప్తారని పాఠశాలకు పంపిస్తే…ఇలాంటి పనులు చేయిస్తారా అని నిలదీశారు.  దీనిపై ఎంఈవో కి విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎంఈవో లక్ష్మీపతి స్పందించారు. పాఠశాలలో ఏం జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ జరుపుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ సంఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

You may also like

Leave a Comment