Telugu News » Peddireddy: ‘చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టో ఏమైంది..?’

Peddireddy: ‘చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టో ఏమైంది..?’

2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆ మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించారని తెలిపారు.

by Mano

2014 ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu) ప్రకటించిన వంద పేజీల మేనిఫెస్టో ఏమైందని ఏపీ మంత్రి(AP Minister) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)  ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.

Peddireddy: 'What happened to Chandrababu's 100-page manifesto..?'

2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆ మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించారని తెలిపారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదని, అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. ప్రతీ ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందుతోందన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతోందని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలను నమ్మించి ఎన్నికల తర్వాత మాట మార్చారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.

You may also like

Leave a Comment