Telugu News » Naatu Naatu: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో నాటు నాటు పాట.. వీడియో వైరల్..!

Naatu Naatu: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో నాటు నాటు పాట.. వీడియో వైరల్..!

ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

by Mano
Naatu Naatu: Naatu Naatu song from Ananth Ambani's wedding ceremony.. Video viral..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా గుజరాత్‌లో జామ్‌నగర్‌లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. మార్చి 1న శుక్రవారం ప్రారంభమైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడో రోజుకు చేరుకున్నాయి.

Naatu Naatu: Naatu Naatu song from Ananth Ambani's wedding ceremony.. Video viral..!

ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు. యావత్‌ ప్రపంచాన్ని షేక్ చేసిన తెలుగు పాట నాటు నాటు (Naatu Naatu) ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి అభిమానులను హోరెత్తించారు. ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్లు రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి సందడి చేశారు.

ఆస్కార్‌ విజేతగా నిలిచిన నాటు నాటు సాంగ్‌కు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌.. తమదైన స్టైల్‌లో హుక్‌ స్టెప్పులతో కలిసి స్టైలిష్‌ స్టెప్పులేశారు. రాంచరణ్‌ కూడా వీరితో జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మొదట ఈ ముగ్గురు జీనే కే హై ఛార్ దిన్ పాటతో మొదలు పెట్టి చివరగా చయ్యా చయ్యా అనే పాటతో ముగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలీవుడ్ మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్ అండ్ షారుక్ ఖాన్ నల్ల కుర్తాలు, పఠానీ సల్వార్‌లో ట్విన్ లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేశారు. ఇక అమీర్ ఖాన్ ఆకుపచ్చ కుర్తాలో తెల్లటి ప్యాంటు, బ్లాక్ బూట్‌లతో కనువిందు చేశాడు.

You may also like

Leave a Comment