Telugu News » Sachin Pilot: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్

Sachin Pilot: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ఎమ్మెల్యే(Rajasthan MLA) సచిన్ పైలట్(Sachin Pilot) జోస్యం చెప్పారు. తెలంగాణ గాంధీభవన్‌లో సోమవారం ఆయన నిరుద్యోగులతో సమావేశమయ్యారు.

by Mano
People of Telangana want change: Sachin Pilot

తెలంగాణ(Telangana) ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాజస్థాన్ ఎమ్మెల్యే(Rajasthan MLA) సచిన్ పైలట్(Sachin Pilot) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని జోస్యం చెప్పారు. తెలంగాణ గాంధీభవన్‌లో సోమవారం ఆయన నిరుద్యోగులతో సమావేశమయ్యారు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

People of Telangana want change: Sachin Pilot

కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని సచిన్ పైలట్ తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలు సంతృప్తినిచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, వారికి క్రెడిబిలిటీ లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగిపోతోందని.. ఈ క్రమంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు.

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని సచిన్ పైలట్ వెల్లడించారు. రాజస్థాన్‌లో ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉందని, అయితే ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వనందునే, ప్రజలు అర్థం చేసుకుని బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు.

సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదని, అధిష్టానమే ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని సచిన్ చెప్పుకొచ్చారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారని చెప్పుకొచ్చారు. ఎల్లుండి (నవంబర్ 30) జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి అని సచిన్ పైలట్ కోరారు.

You may also like

Leave a Comment