అయోధ్య(Ayodhya)లో రామ్‌లల్లా(Ram lala) ప్రతిష్ఠాపనకు సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ ఇంతటి ఉద్వేగానికి లోనుకాలేదని చెప్పారు.
11 రోజుల పాటు ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని ఆడియో సందేశాన్ని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్‌లోనూ పోస్ట్ చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని మోడీ తెలిపారు.
‘గతంలో ఎప్పుడూ ఇంతటి ఉద్వేగానికి లోను కాలేదు.. జీవితంలో మొదటిసారి ఇలాంటి అనుభూతిని పొందుతున్నా. శ్రీరామ మూర్తి ప్రాణ ప్రతిష్ఠకు భారతీయులకు ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఈ అద్భుత సమయంలో నా మదిలో చెలరేగిన భావాలను వ్యక్తీకరించడం కొంత కష్టంగా ఉంది’ అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.
కాగా, హిందూ శాస్త్రాల ప్రకారం ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠాపనకు ముందు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆ నియమాలన్నింటినీ పాటించాలని సంకల్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముందు ఉపవాసం ఉండాలని కొన్ని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం, ప్రార్థనలు చేయడం, ఆహార నియమాలు వంటి వాటిని వివరించారు.
प्राण-प्रतिष्ठा से पूर्व 11 दिवसीय व्रत अनुष्ठान का पालन मेरा सौभाग्य है। मैं देश-विदेश से मिल रहे आशीर्वाद से अभिभूत हूं। https://t.co/JGk7CYAOxe pic.twitter.com/BGv4hmcvY1
— Narendra Modi (@narendramodi) January 12, 2024