Telugu News » Liquor : మద్యం ప్రియులకు షాక్.. జనవరి 22న వైన్స్ బంద్..!!

Liquor : మద్యం ప్రియులకు షాక్.. జనవరి 22న వైన్స్ బంద్..!!

మద్యం దుకాణాలు మూసి వేయాలని రాజస్థాన్‌, జైపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ శర్మ చేసిన డిమాండ్‌ను మేయర్ తిరస్కరించారు. ఇక, ప్రధాని మోడీ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు 11 రోజుల గడువు ఉన్నందున ఈ 11 రోజులు తాను ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

by Venu

మద్యం చుక్క గొంతులోకి దిగనిదే పూట గడవని వారికి షాకింగ్ న్యూస్.. జనవరి 22న వైన్స్ షాప్‌లు బంద్ ప్రకటించారు.. కారణం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh).. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh).. అస్సాం (Assam).. రాజస్థాన్ (Rajasthan) జనవరి 22న ‘డ్రై డే’ గా ప్రకటించాయి. ఇలా మద్యం ప్రియులకు నాలుగు రాష్ట్రాలు షాక్ ఇచ్చాయి.

Dry Day: Bad news for drug addicts.. Those three days..!!

ఈ మేరకు యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలకు సైతం ఈ రోజు సెలవు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ కొత్త సీఎం విష్ణు దేవ్ సాయి సైతం స్పెషల్ డే సందర్భంగా మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. అస్సాం పర్యాటక శాఖ మంత్రి జయంత్ మల్లా సైతం జనవరి 22న డ్రై డేగా ప్రకటించారు.

మరోవైపు మద్యం దుకాణాలు మూసి వేయాలని రాజస్థాన్‌, జైపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ శర్మ చేసిన డిమాండ్‌ను మేయర్ తిరస్కరించారు. ఇక, ప్రధాని మోడీ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు 11 రోజుల గడువు ఉన్నందున ఈ 11 రోజులు తాను ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాగా ఇప్పటికే రామయ్య రాక కోసం అయోధ్యలో భారీ అలంకరణ మరియు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

You may also like

Leave a Comment