Telugu News » PM Modi: దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మన మాట వింటుంది: ప్రధాని మోడీ

PM Modi: దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మన మాట వింటుంది: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ(PM Modi) భారత్ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని పీలీఖీల్లో బీజేపీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

by Mano
Prime Minister Modi's visit to Telangana is fixed.. A solid strategy for double digit seats!

ప్రధాని మోడీ(PM Modi) భారత్ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని పీలీఖీల్లో బీజేపీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

PM Modi: The world will listen to us only if the country is strong: PM Modi

బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం కల్యాణ్ సింగ్ పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సీఎంగా ఉన్న ఆయన రామమందిర నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. దేశంలోని ప్రతీ కుటుంబం అయోధ్య మందిరాన్ని నిర్మించేందుకు సహకరించిందన్నారు. కానీ, ఇండియా కూటమి మాత్రం వ్యతిరేకిస్తూనే ఉందని విమర్శించారు.

అనంతరం మోడీ దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా అనేక కష్టాలను ఎదుర్కొంటోందని, సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. భారత్ తలచుకుంటే కచ్చితంగా పరిష్కరించగలదని అన్నారు. భారత్ స్ఫూర్తి, శక్తితో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు మనమంతా కృషి చేస్తున్నామన్నారు. అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని పునరుద్ఘాటించారు.

దేశం బలంగా ఉన్నప్పుడే ప్రపంచం దాని మాట వింటుందని, ప్రతీఒక్కరి ఓటు బలంతోనే అది సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ ప్రపంచ దేశాల నుంచి ఎన్నోసార్లు సాయం కోరిందని విమర్శించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని సగర్వంగా చాటి చెప్పారు.

భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించినప్పుడు మీరు గర్వించామన్నారు. చంద్రయాన్ ద్వారా చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడూ గర్వించామని గుర్తుచేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు సమర్ధవంతంగా బాధ్యత వహించిన భారత్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయని మోడీ వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment