Telugu News » PM Modi : మోడీ చేతుల మీదుగా తొలిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్.. అందుకొన్న వారు వీరే..!

PM Modi : మోడీ చేతుల మీదుగా తొలిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్.. అందుకొన్న వారు వీరే..!

మరోవైపు ది బెస్ట్ స్టోరీటెల్లర్ అవార్డ్ నుంచి ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ వరకు పలు విభాగాల్లో 200 మంది క్రియేటర్‌లు నామినేట్ అయ్యారు. నామినీలలో కత్రినా కైఫ్, కంగనా రనౌత్, రణవీర్ వంటి నటీనటులు ది ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ కేటగిరీ కింద గుర్తింపు పొందారు.

by Venu
PM Modi: Congress has misled the country: PM Modi

సోషల్ మీడియా క్రియేటర్లకు ఇప్ప వరకు సరైన గుర్తింపు లేదు.. కానీ దేశంలో ఇకపై వీరికి కూడా మంచి గుర్తింపు దక్కనుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi) పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ (National Creators Award) అవార్డులను ఢిల్లీ (Delhi)లోని భారత్ మండపం (Bharat Mandapam)లో అందించారు.

PM Modi: This is a historic day.. Prime Minister Modi's tweet..!ఈ కార్యక్రమంలో భాగంగా మైథిలీ ఠాకూర్‌కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేశారు. దీంతోపాటు జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డులను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ సహా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.

ఈ అవార్డులను ప్రస్తుతం 20 విభాగాల్లో అనౌన్స్ చేశారు. కాగా వీటి కోసం అప్లై చేసుకొనే వ్యక్తులు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కల్గి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు భారతీయులై ఉండి, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించబడిన కంటెంట్‌ను కలిగి ఉండాలని తెలిపారు. ఇక కంటెంట్ సృష్టికర్తలు గరిష్టంగా మూడు కేటగిరీలలో స్వయంగా నామినేషన్ వేసుకోవచ్చని అన్నారు..

మరోవైపు ది బెస్ట్ స్టోరీటెల్లర్ అవార్డ్ నుంచి ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ వరకు పలు విభాగాల్లో 200 మంది క్రియేటర్‌లు నామినేట్ అయ్యారు. నామినీలలో కత్రినా కైఫ్, కంగనా రనౌత్, రణవీర్ వంటి నటీనటులు ది ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ కేటగిరీ కింద గుర్తింపు పొందగా, సోషల్ మీడియా విభాగంలో కోమల్ పాండే, సిద్ధార్థ్ బాత్రా, కృతిక ఖురానా వంటి వారు ఉన్నారు. అదేవిధంగా మొదటి రౌండ్‌లో 20 విభిన్న కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు రాగా ఓటింగ్ రౌండ్‌లో వివిధ విభాగాల్లో డిజిటల్ సృష్టికర్తలకు దాదాపు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తలతో సహా 23 మంది విజేతలను నిర్ణయించారు.

You may also like

Leave a Comment