సాధారణంగా చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ప్రభుత్వ అధికారులకు ఎంత డబ్బు చెల్లిస్తారు..? వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారు అని.. ఈరోజు మేము మీకోసం చీఫ్ మినిస్టర్ నుండి ప్రధానమంత్రి వరకు ఎవరికి ఎంత ప్రభుత్వం ఇస్తుంది అనే వివరాలని పొందపరిచాము. మరి ఈ విషయాల్లో మీకు కూడా ఆసక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే వీటి గురించి చూసేయండి.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, రూ. 5 లక్షలు :
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 25 జూలై 2022న ప్రమాణ స్వీకారం చేశారు. ‘ది ప్రెసిడెంట్స్ అచీవ్‌మెంట్ అండ్ పెన్షన్ యాక్ట్ ఆఫ్ 1951’ కింద ఆమెకి జీతం కేటాయించబడింది. భారతదేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా ఆమె హిస్టరీని క్రియేట్ చేసారు. ఆమెకి రూ. 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. బుల్లెట్ షాక్ ప్రూఫ్ కార్లు, ఎలైట్ ఆర్మీ సెక్యూరిటీ, రవాణా, వైద్య సంరక్షణ మరియు 340 రూమ్ రాష్ట్రపతి భవన్. అలానే ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్, రూ. 4 లక్షలు:
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ 11 ఆగస్టు 2022న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత జీతం నెలకు రూ. 4 లక్షలు. ఉచిత ఇల్లు, సెక్యూరిటీ, ఉచిత వైద్య సంరక్షణ, ఉచిత విమాన, రైలు ప్రయాణాలు. అలానే ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
Also read:
PM నరేంద్ర మోడీ, రూ. 2 లక్షలు:
నరేంద్ర మోడీకి రెండు లక్షలతో పాటు ఢిల్లీలో నివాసం, IAF పైలట్‌లతో బోయింగ్ 777-300ER యాక్సెస్, రవాణా, ఆరోగ్య బీమా అలానే ప్రత్యేక భద్రత ఉంటుంది. అలానే ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 4 లక్షలు:
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి నెలకు రూ.4 లక్షల జీతం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉదవ్ ఠాక్రే కి జీతం రూ.3.4 లక్షలు. సీనియారిటీ, యోగ్యత వంటి తేడాల కారణంగా మంత్రుల కి వేతనంలో తేడా ఉంటుంది. గవర్నర్ కి రూ. 3.5 లక్షలు. మెంబెర్స్ అఫ్ ది పార్లమెంట్ కి లక్ష ఇస్తారు.