Telugu News » Prabhas: ప్రభాస్ పెళ్లి ఫొటోస్ వైరల్… ఈ సూపర్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్ వేసేయండి..!

Prabhas: ప్రభాస్ పెళ్లి ఫొటోస్ వైరల్… ఈ సూపర్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్ వేసేయండి..!

by Sravya
Prabahs-Marriage

ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ప్రభాస్ బాహుబలి సినిమాతో రికార్డు ని క్రియేట్ చేశారు. పైగా అంతర్జాతీయ లెవెల్లో బాహుబలి సినిమాతో గుర్తింపు కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ అనగానే మొట్టమొదట ఆయన పెళ్ళెప్పుడు చూసుకుంటారు అనే ప్రశ్న మన మెదడులోకి వస్తుంది. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికి అనేక వార్తలు వచ్చాయి. ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. పాన్ ఇండియా ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి మాటే ఎత్తట్లేదు. ఫుల్లుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు డార్లింగ్. పైగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే చేస్తున్నారు. అయితే బాహుబలి సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి కోసం అంతా ఎదురు చూస్తున్నా, పెళ్లి ఊసే లేదు. పెళ్లి ఎప్పుడు అని ప్రభాస్ ని అడిగితే ఆ మాటను కూడా దాటేస్తుంటారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో డార్లింగ్ పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ అనుష్క. వీళ్ళిద్దరి పెళ్లి అయిపోయినట్లు ఆర్టిఫిషియల్ ఫొటోస్ క్రియేట్ చేసి విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు తెగ షికార్లు కొడుతున్నాయి. కానీ ఏ మాటకామాట చెప్పాలి ఈ ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి. ప్రభాస్ అనుష్క చాలా అందంగా కనపడుతున్నారు.

Prabahs-Marriage

కొద్ది రోజుల క్రితం అనుష్క ప్రభాస్ ఫ్యామిలీ అని ఒక పాపతో ఫోటోని పెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతున్నాయి మరి అందమైన ఫోటోలని మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Also read: 

You may also like

Leave a Comment