Telugu News » Prashanth Nair: మీకు తెలుసా..? పైలట్ ప్ర‌శాంత్ నాయ‌ర్ ఎవరంటే…?!

Prashanth Nair: మీకు తెలుసా..? పైలట్ ప్ర‌శాంత్ నాయ‌ర్ ఎవరంటే…?!

గగన్‌యాన్ మిషన్‌(Gaganyan Mission)లో భాగంగా రోదసీలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వారిలో ప్ర‌శాంత్ నాయ‌ర్(Prashant Nair) ఒకరు. ఆయది కేర‌ళలోని పాలక్క‌డ్‌లోని నేన్‌మెరా స్వగ్రామం.

by Mano
Prashanth Nair: You know..? Who is pilot Prashant Nair...?!

గగన్‌యాన్ మిషన్‌(Gaganyan Mission)లో భాగంగా రోదసీలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వారిలో ప్ర‌శాంత్ నాయ‌ర్(Prashant Nair) ఒకరు. ఆయది కేర‌ళలోని పాలక్క‌డ్‌లోని నేన్‌మెరా స్వగ్రామం. భార‌తీయ నౌకాద‌ళం(Indian Navy)లో ప్ర‌శాంత్ సుఖోయ్ ఫైట‌ర్ పైలట్‌గా చేశారు. తాజాగా గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు టీమ్ లీడ‌ర్‌గా ఎంపిక అయ్యారు.

Prashanth Nair: You know..? Who is pilot Prashant Nair...?!

ప్ర‌శాంత్ పేరెంట్స్ వాలంపిల్ బాల‌కృష్ణ‌న్‌, కూల‌న్‌ఘాట్ ప్ర‌మీల‌. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో ప్ర‌శాంత్ విద్యార్థిగా చేశారు. పాలక్క‌డ్‌లోని ఎన్ఎస్ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఎన్డీఏ అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేశాడు. 1999లో అత‌ను ఎయిర్‌ఫోర్స్‌లో విధుల్లో చేరారు.

అదేవిధంగా అమెరికాలో ప్రశాంత్ నాయ‌ర్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అమెరికా ఎయిర్ క‌మాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ఆయ‌న ఫ‌స్ట్ క్లాస్‌లో పూర్తి చేశారు. 1998లో హైద‌రాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో స్వార్డ్ ఆఫ్ హాన‌ర్ అందుకున్నారు. గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నింగిలోకి వెళ్లే న‌లుగురు వ్యోమ‌గాముల్ని ఇవాళ ప్ర‌ధాని మోడీ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

మరోవైపు గ‌గ‌న్‌యాన్‌కు ఎంపికైన ఆస్ట్రోనాట్స్‌కు ర‌ష్యాలో శిక్ష‌ణ ఇచ్చారు. 18 నెల‌ల పాటు శిక్ష‌ణ సాగింది. ఆ బృందానికి ప్ర‌శాంత్ నాయ‌ర్ నాయ‌క‌త్వం వ‌హించారు. ర‌ష్యాలో శిక్ష‌ణ త‌ర్వాత బెంగుళూరులోని హ్యూమ‌న్ స్పేస్ సెంట‌ర్‌లోనూ ఆస్ట్రోనాట్స్ సన్నద్ధమయ్యారు. వ్యోమ‌గాముల జాబితాలో ప్ర‌శాంత్ నాయ‌ర్‌తో పాటు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ‌న్‌, అంక‌ద్ ప్ర‌తాప్‌, వింగ్ క‌మాండ‌ర్ శుభాన్షు శుక్లా ఉన్నారు.

You may also like

Leave a Comment