Telugu News » Bandla Ganesh: మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్..!

Bandla Ganesh: మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(CM Jagan), మంత్రి రోజా(Minister Roja)లపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్(Bandla Ganesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్ అన్నారు.

by Mano
Bandla Ganesh: Congress leader Bandla Ganesh's shocking comments on Minister Roja..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(CM Jagan), మంత్రి రోజా(Minister Roja)లపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్(Bandla Ganesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్ అన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)యాక్సిడెంటల్ సీఎం కాదనీ… సీఎం జగనే యాక్సిడెంటల్ సీఎం అని ఆయన ఫైర్ అయ్యారు.

Bandla Ganesh: Congress leader Bandla Ganesh's shocking comments on Minister Roja..!

భారతదేశంలో సీఎం రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారని బండ్ల గణేశ్ తెలిపారు. రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ అని ఆయన కొనియాడారు. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని.. ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

నాన్న చనిపోతేనే, నాన్న వారసత్వంతోనే సీఎం అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారని ఎద్దేవ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాకు లేదన్నారు బండ్లగణేశ్. రేపోమాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రొగ్రామ్‌లు చేసుకోవాలని ఆయన సెటైర్లు వేశారు.

అదేవిధంగా రోజా ఐటం రాణివి అంటూ.. బండ్ల ఫైర్ అయ్యారు. నువ్వు పులుసు వండిపెట్టావ్ కాబట్టి పులుసు పాపవి. రేపో మాపో మాజీ అవుతావు. పగలు జబర్దస్త్ షూటింగ్లు, రాత్రిళ్లు మాజీలంతా తాజాగా కేజీలు తెచ్చుకుని పులుసు వండి పెట్టుకోవాలని బండ్ల గణేశ్ విమర్శించారు.

You may also like

Leave a Comment