Telugu News » Hyderabad : బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్.. ఫార్మా ప్రతినిధులకు కీలక హామీ..!

Hyderabad : బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్.. ఫార్మా ప్రతినిధులకు కీలక హామీ..!

రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు..

by Venu
Good news for Anganwadi teachers.. CM Revanth Reddy's key decision!

ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. HICCలో మూడు రోజుల పాటు జరిగే సదస్సులో భాగంగా తొలిరోజు జీనోమ్ వ్యాలీ (Genome Valley)లోని భారత్ బయోటెక్ తదితర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఫార్మా రంగానికి ప్రపంచ వేదికగా ఉందని తెలిపారు.

Telangana CM for early start to Musi Riverfront development work

నగరంలో పెట్టుబడులు పెడుతున్న ఫార్మా రంగ ప్రతినిధులకు అభినందనలు తెలిపిన సీఎం.. వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నగరాభివృద్ధి కోసం ఫార్మావిలేజ్ లకు రూపకల్పన చేశామని తెలిపారు.. ఎన్నో ఇబ్బందులను సృష్టించిన కరోనా సమయంలో హైదరాబాద్ (Hyderabad)లో ఉత్పత్తి అయిన టీకాలు ప్రపంచ వ్యాప్తంగా సరాఫరా అయ్యాయని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.. త్వరలో జినోమ్ వ్యాలీ ఫేజ్-2ను ప్రారంభిస్తామని, హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కు రాజధానిగా మారుస్తామని సీఎం తెలిపారు.. ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తెలిపిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఫార్మా రంగం అభివృద్ధికి ప్రభుత్వ సహకారాం ఎప్పుడు ఉంటుందన్నారు..

ఇటీవల ఈ రంగానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యామని అన్నారు. మరోవైపు 21వ బయో ఆసియా సదస్సులో 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాల విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోమెడికల్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్యరంగంలో ఆవిష్కరణలు, వైద్య పరికరాలకు ప్రోత్సాహకాలపై చర్చలు మొదలైయ్యాయి.

ఈ సమస్యలపై పరిశోధనలు చేస్తున్న విత్తన కంపెనీలకు ప్రోత్సాహకాలు, మద్దతుపై అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించడానికి 700 కంటే ఎక్కువ వినూత్న స్టార్టప్‌లు పోటీ పడగా, నిపుణులు షోకేస్ కోసం 70 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురిని షార్ట్‌లిస్ట్ చేసి కాన్ఫరెన్స్ చివరి రోజు అయిన 28వ తేదీన ప్రత్యేక అవార్డులను అందజేస్తారు. మరోవైపు నోబెల్ గ్రహీత, ప్రముఖ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నారు.

You may also like

Leave a Comment