Telugu News » Mallikarjun Kharge : రాహుల్ గాంధీకి భద్రత కల్పించండి.. అమిత్ షాకు-మల్లికార్జున్ ఖర్గే లేఖ..!!

Mallikarjun Kharge : రాహుల్ గాంధీకి భద్రత కల్పించండి.. అమిత్ షాకు-మల్లికార్జున్ ఖర్గే లేఖ..!!

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి గౌహతిలోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అసోం పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని హోం మంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు.

by Venu
Parliament security breach happened due to unemployment says Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. రాహుల్ సహా కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు గౌహతి నగర సరిహద్దులో అస్సాం పోలీసు సిబ్బందితో ఘర్షణ పడిన తర్వాత ఈ లేఖ రాశారు.

Amit Shah keeps rewriting history Rahul Gandhi on remarks against Nehru

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి గౌహతిలోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అసోం పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని హోం మంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ Z+ భద్రతకు అర్హుడని తెలిపారు.

ఇది కాకుండా, కాంగ్రెస్ పోస్టర్లను చింపివేయడంతో పాటు జనవరి 21న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పర్యటనను అడ్డుకోన్నారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడిని గురించి ప్రస్తావించారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ పని జరిగిందని ఖర్గే ఆరోపించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ దగ్గరికి వచ్చేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు పర్మిషన్ ఇచ్చారు అని మండిపడ్డారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ.. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) జీపీ సింగ్‌ను ఆదేశించారు.. ఈ ఘటనలో బారికేడ్‌ను బద్దలు కొట్టేందుకు రాహుల్ ప్రజలను ప్రేరేపించినందుకు ఆయనతో సహా పలువురు కాంగ్రెస్ సభ్యులపై కేసు నమోదు చేశారు. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు గౌహతి ప్రధాన రహదారుల్లోకి రాకుండా హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా గాయపడ్డారు.

You may also like

Leave a Comment