Telugu News » Aditya-L1 : నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌ 1

Aditya-L1 : నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌ 1

ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1) తో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది.

by Sai

ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1) తో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శుక్రవారం కౌంట్ డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

aditya l1

శనివారం ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించారు. ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అందుకు దాదాపు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది.

అయితే ఎల్​1 పాయింట్​కు చేరుకోవడం అంత సులభం కాదు. ఈ టాస్క్​ను పూర్తి చేసేందుకు లిక్విడ్​ అపోజీ మోటార్​ (ఎల్​ఏఎం)ను రూపొందించింది ఇస్రోకు చెందిన లిక్విడ్​ ప్రొపల్షన్​ సిస్టెమ్​ సెంటర్ విభాగం​. ఈ మిషన్​ ప్రధాన లక్ష్యాలను ఇస్రో ప్రకటించింది. కొరొనల్​ హీటింగ్​, సౌర మంటలు, కొరొనల్​ మాస్​ ఇజెక్షన్స్​, సౌర గాలులు, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతుంది ఆదిత్య ఎల్​-1.

ఈ ఆదిత్య ఎల్​1లో 7 పేలోడ్స్​ ఉంటాయి. వీటిల్లో విజిబుల్​ ఎమిషన్​ లైన్​ కొరొనాగ్రఫీ ఒకటి. నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న అనంతరం.. ఇది భూమికి, రోజుకు 1440 ఇమేజ్​లను పంపిస్తుంది. మొత్తం 7 పేలోడ్స్​లో నాలుగింటింటి సూర్యుడి ఖాంతిని అబ్సర్వ్​ చేసేందుకు వినియోగిస్తోంది ఇస్రో. మరో మూడింటినీ ప్లాస్మా, మాగ్నెటిక్​ ఫీల్డ్స్​ వంటి వాటిపై పరిశోధనల కోసం వాడుతోంది.

ఆదిత్య ఎల్​1 జీవితకాలం ఐదేళ్లని తెలుస్తోంది. అప్పటివరకు భూమికి ఫొటోలు పంపుతూ ఉంటుంది. అయితే.. ఇంధనం ఖర్చు చేసే ఆధారంగా ఇది 5ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది.

You may also like

Leave a Comment