Telugu News » Coming Soon, New iPhone 15: కొత్త ఐ ఫోన్ వస్తోంది, పాత ఫోన్ల ధరలు తగ్గాయోచ్!

Coming Soon, New iPhone 15: కొత్త ఐ ఫోన్ వస్తోంది, పాత ఫోన్ల ధరలు తగ్గాయోచ్!

ఐఫోన్ 13 ఇంతకు ముందెప్పుడూ లభించలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు కొత్త ఫోన్ లాంచింగ్ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 14 ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

by Prasanna

ఐఫోన్ 15 (iPhone 15)  తర్వలో రాబోతున్నాయి. ఈ సీరిస్ కోసం ఎదురు చూస్తున్న ఐఫోన్ ప్రియులకు మరో గుడ్. కొత్త ఫోన్ విడుదల చేస్తున్న సందర్భంలో ఐపోన్ 13 (iPhone 13)  ఫోన్ల ధరల (Low Price)ను తగ్గించింది.

I phone 15 new version

అమెజాన్, ప్లిఫ్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్ సైట్లలో ఐఫోన్ 13 ఫోన్లు ఆఫర్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్సేంజ్ ఆఫర్లతో కలిపి మరింత తక్కువ ధరకే ఐఫోన్ 13 లభిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్ లో ఐఫోన్ 13 ధర రూ.69,900 కాగా, దీనిని అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ లలో రూ.58,999కే పొందవచ్చు. అదే హెడీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు సాయంతో ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాంలో కొనుగోలు చేస్తే మరో రూ.3 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే అప్పుడు ఐఫోన్ అంటే రూ.56,999కే లభిస్తుంది.

ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 13 ఇంతకు ముందెప్పుడూ లభించలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు కొత్త ఫోన్ లాంచింగ్ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 14 ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 12న యాపిల్ మెగా ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేయనుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పేరిట ఈ ఫోన్లు రానున్నాయి.

You may also like

Leave a Comment