Telugu News » Pushpa The Rule: జైలు నుంచి కేశవ విడుదల.. పుష్ప 2 షూటింగ్‌ షురూ..!

Pushpa The Rule: జైలు నుంచి కేశవ విడుదల.. పుష్ప 2 షూటింగ్‌ షురూ..!

ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ సూసైడ్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు జగదీశ్‌ బండారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం జగదీశ్‌ బండారి బెయిల్‌పై విడుదలై.. పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొన్నట్లు టాలీవుడ్ టాక్.

by Mano
Pushpa The Rule: Keshav released from jail.. Pushpa 2 shooting started..!

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప.. ది రూల్‌ (Pushpa 2). తాజాగా పుష్ప 2 షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో పుష్పరాజ్‌ స్నేహితుడు కేశవ పాత్రలో జగదీశ్‌ ప్రతాప్ బండారి((Jagadeesh bandari)) నటించిన విషయం తెలిసిందే.

Pushpa The Rule: Keshav released from jail.. Pushpa 2 shooting started..!

ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ సూసైడ్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు జగదీశ్‌ బండారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప 2 షూటింగ్ వాయిదా పడింది. డిసెంబర్‌ 2023 నుంచి జగదీశ్‌ బండారి చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం జగదీశ్‌ బండారి బెయిల్‌పై విడుదలై.. పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొన్నట్లు టాలీవుడ్ టాక్.

ఈ సినిమాలో కీలకంగా వచ్చే గంగమ్మ జాతర సీన్‌ షూట్‌లో జగదీశ్ బండారి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పుష్ప.. ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప 2 వస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా అలరించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి ఫీమేల్ లీడ్ రోల్‌లో సందడి చేయనుంది.

ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్‌ పార్ట్‌ పుష్ప..ది రైజ్‌ తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో మ్యూజికల్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియాక్రేజ్‌ను తెచ్చి పెట్టింది.

 

You may also like

Leave a Comment