శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) లో ఖతార్ ఎయిర్ లైన్స్(Qatar Airlines) విమానం అత్యవసర ల్యాండింగ్(Emergency Landing) అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఖతార్ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్ చేశారు. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన ఖతార్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికులు కాస్త టెన్షన్ పడ్డారు.
నాగపూర్ లో వాతావరణం అనుకూలించకపోవడంతోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని 300 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ లో సేఫ్ గా ల్యాండింగ్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
జులై నెలలో కూడా దుబాయ్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగ్ పూర్ కు విమానాన్ని తీసుకుని వెళ్లలేకపోయారు పైలట్లు.
విమానం ల్యాండింగ్‌కు అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి, శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అందులోని 160 మంది ప్రయాణికులను నోవాటెల్‌కు తరలించారు. వాతావరణం అనుకూలించి, విమానానికి అనుమతులు వచ్చిన తర్వాత విమానం బయలుదేరింది.