Telugu News » Rachakonda CP : ప్రేక్షకులకు ఉప్పల్ స్టేడియంలోకి అప్పుడే అనుమతి.. వాటికి మాత్రం నో పర్మిషన్..!!

Rachakonda CP : ప్రేక్షకులకు ఉప్పల్ స్టేడియంలోకి అప్పుడే అనుమతి.. వాటికి మాత్రం నో పర్మిషన్..!!

మైదానానికి ప్రేక్షకులు పీక్ హవర్స్‌లో వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. అదీగాక 1500 మంది పోలీసులతో మ్యాచ్‌కి బందోబస్తు ఏర్పాటు చేశాం.

by Venu
IND Vs ENG: Test series with England.. This is the Indian team..!

హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ ( Ind Vs Eng Test) పోరుకు సర్వం సిద్ధమైంది. ఉప్పల్లో (Uppal) గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ఎదురులేని భారత్‌‌ను.. బజ్‌బాల్‌ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టును ఏ మేరకు అడ్డుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఉప్పల్‌ పిచ్‌‌ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న క్రమంలో ఇరు జట్లు ఆ స్పిన్ ని అస్త్రాలుగా మలచుకొని బరిలోకి దిగుతున్నాయి.

మరోవైపు మ్యాచ్ చూడటం కోసం వెళ్తున్న వారికి కీలక సూచనలు చేశారు రాచకొండ సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Sudhir Babu).. ఉప్పల్ స్టేడియంలో (Stadium)కి ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు. కాగా స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్టు వెల్లడించారు. ప్రేక్షకులతో పాటు పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని చెప్పారు.

మైదానానికి ప్రేక్షకులు పీక్ హవర్స్‌లో వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. అదీగాక 1500 మంది పోలీసులతో మ్యాచ్‌కి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయని వెల్లడించారు. ఇక స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్‌ టాప్స్, బ్యాగ్స్, సిగెరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించమని తెలిపారు.

ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే.. తిరిగి స్టేడియం లోపలికి అనుమతించమని.. బ్లాక్ టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. మరోవైపు ఉప్పల్ స్టేడియం టీమిండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు హైదరాబాద్ గడ్డపై ఓడిందే లేదు. ఇప్పటివరకూ ఉప్పల్‌ స్టేడియంలో భారత జట్టు ఐదు టెస్టులు ఆడగా.. నాలుగింట విజయం సాధించింది. మరోకటి డ్రాగా ముగిసింది.

You may also like

Leave a Comment