Telugu News » Raghunandan Rao : కేసీఆర్ కుటుంబంలో గొడవలు.. బ్లాక్ మెయిల్ చేస్తున్న హరీష్ రావు..?

Raghunandan Rao : కేసీఆర్ కుటుంబంలో గొడవలు.. బ్లాక్ మెయిల్ చేస్తున్న హరీష్ రావు..?

మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్త తెలుసుకొని.. వాళ్ళతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని రఘునందన్ రావు ఆరోపించారు.. సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ముందుకు సాగిందని.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని అన్నారు.

by Venu

తెలంగాణ అంటే కేసీఆర్.. ఆయన ఫ్యామిలీ.. ఇది గత చరిత్ర.. కేసీఆర్ అంటే ఇప్పుడు తెలంగాణ కాదని అంటున్నారు.. కుంటుంబపాలన గడీలు ముక్కలు చేసి కాంగ్రెస్ ను ప్రభుత్వంలో కూర్చోపెట్టిన రేవంత్ రెడ్డి అంటే కార్యకర్తల్లో ఉన్న అభిమానం అందరికి తెలిసిందే.. ఇప్పటికే రేవంత్ ఫాలోయింగ్ చూసిన బీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని కూల్చడానికి వాడిన అస్త్రాలు తిరిగి ఆ పార్టీనే ముప్పతిప్పలు పెడుతున్నాయని అనుకొంటున్నారు.

kcr

ఇదే సమయంలో సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మెదక్ (Medak) ఎంపీ సీటు (MP Seat) కోసం గొడవలు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. ఆ సీటు కోసం పట్టుబడుతున్న కవితను.. హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్త తెలుసుకొని.. వాళ్ళతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని రఘునందన్ రావు ఆరోపించారు.. సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ముందుకు సాగిందని.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని అన్నారు. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమన్నారు..

మరోవైపు గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్‌ జోస్యం పలికారు. అప్పటి హిస్టరీ ఇప్పుడు రిపీట్‌ అవుతుంటే బాధపడుతున్న నేతలకు అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదా? అని ప్రశ్నించారు.. మీరు ముంచాలని భావించారు.. నిండా మునుగుతోన్నారని రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు..

You may also like

Leave a Comment