ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరెంటు బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) మద్దతు ఇస్తోందని విమర్శించారు. విద్యుత్ బిల్లుల రూపంలో ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారని ఆరోపించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్‌గాంధీ బొగ్గు ధరల పెరుగుదలపై లండన్‌కు చెందిన ఫైనాన్సియల్ టైమ్స్‌లో వచ్చిన కథనానికి స్పందించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుధరను పెంచడమే విద్యుత్ బిల్లుల పెరుగుదలకు కారణమని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
‘రూ.12వేల కోట్లు అదానీ తీసుకున్నాడని నేనే కాదు.. లండన్‌కు చెందిన ఫైనాన్సియల్ టైమ్స్ చెబుతోంది.’ ఈ కథనంపై దేశంలో ఏ మీడియా ప్రశ్నించదు..’ అని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ తనను తాను కాపాడుకోవడానికే మౌనం వహిస్తూ అదానీని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వెనుక ఉన్న శక్తి ఏమిటో అందరికీ తెలుసన్నారు. 2024 ఎన్నికల్లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అదానీ గ్రూపులపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఈ సందర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు.
#WATCH | When asked why he is not raising questions about Sharad Pawar's meeting with Adani despite INDIA alliance united on Adani issue, Congress MP Rahul Gandhi says, " I have not asked Sharad Pawar, he is not the Prime Minister of India. Sharad Pawar is not protecting Adani,… pic.twitter.com/Yak56drO0g
— ANI (@ANI) October 18, 2023