కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(RahulGandhi) ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) లో పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజీని ఆయన చూశారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాహుల్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబులు ఉన్నారు. అంతకుముందు అంబటిపల్లి వద్ద మహిళ సాధికార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అమలు చేయబోయ ఆరు గ్యారంటీలను రాహుల్ వివరించారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘‘దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంలా మారింది. బ్యారేజీల పిల్లర్లు కుంగిపోతున్న కేసీఆర్ ఎందుకు పరిశీలనకు రావడం లేదు’’ అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడు ఒక్కటేనని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ ప్రజలను కోరారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వివరించారు.