Telugu News » Rain Alert: ఆరెంజ్ అలర్ట్.. రాష్ట్రంలో ఐదు రోజులు పాటు వర్షాలు..!

Rain Alert: ఆరెంజ్ అలర్ట్.. రాష్ట్రంలో ఐదు రోజులు పాటు వర్షాలు..!

పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ(Telangana)పై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

by Mano
Rain Alert:

మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ(Telangana)పై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Rain Alert: Orange Alert.. Rains in the state for five days..!

కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 10 నుంచి వాతావరణంలో కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది.

ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే చిరుజల్లులు కురిసాయి. రాజధాని చెన్నెలోనూ రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది.

రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

 

You may also like

Leave a Comment