Telugu News » Raja Singh: ఆ సినిమాకు మద్దతివ్వడం మన బాధ్యత: ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: ఆ సినిమాకు మద్దతివ్వడం మన బాధ్యత: ఎమ్మెల్యే రాజాసింగ్

యువ హీరో తేజ సజ్జ(Teja Sajja) నటించిన ‘హనుమాన్’(Hanuman) సినిమాకు థియేటర్ల డిస్ట్రిబ్యూషన్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. హనుమాన్ సినిమాకు మద్దతివ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

by Mano

సంక్రాంతి(Sankranti) పండుగకు అగ్రహీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మహేశ్‌బాబు, నాగార్జున, వెంకటేశ్ తగ్గేదేలే అంటున్నారు. వీరి సినిమాలతో పాటు యువ హీరో తేజ సజ్జ(Teja Sajja) నటించిన ‘హనుమాన్’(Hanuman) సినిమా విడుదలవుతోంది.

 

అయితే, ఈ నాలుగు సినిమాలు విడుదల కానుండటంతో థియేటర్ల డిస్ట్రిబ్యూషన్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. హనుమాన్ సినిమాకు మద్దతివ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

హనుమాన్ వంటి చిత్రాలు మన దేశానికి, హిందూ మతం గొప్పతనానికి గుర్తింపునిస్తాయని రాజాసింగ్ తెలిపారు. శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి ఆశీర్వాదం పొందిన ఓ అదృష్ట యువకుడి కథ ఆధారంగా సినిమాను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి గొప్ప ప్రయత్నానికి అందరూ అండగా నిలబడాలని కోరారు.

మరోవైపు, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ టికెట్‌పై రూ.5లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

You may also like

Leave a Comment