Telugu News » Accident : రోడ్ టెర్రర్.. ఆరుగురి ప్రాణాలు బలిగొన్న బైక్ రైడ్..!!

Accident : రోడ్ టెర్రర్.. ఆరుగురి ప్రాణాలు బలిగొన్న బైక్ రైడ్..!!

ఈ రోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ (IDPL) చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్, డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

by Venu
Road Accident: Bloody roads.. Seven dead..!

రంగారెడ్డి (Rangareddy)జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో దారుణం చోట చేసుకుంది.. స్థానిక మున్సిపల్ పరిధిలో ఆదివారం రాత్రి కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మరణించగా.. షేక్ రహీమ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో బృంగి ఆసుపత్రికి తరలించారు.

road accident

అయితే అప్పటికే రహీమ్‌ మరణించినట్టు డాక్టర్ తెలిపారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై

అయితే అప్పటికే రహీమ్‌ మరణించినట్టు డాక్టర్ తెలిపారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ (IDPL) చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్, డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గమనించిన స్థానికులు గాయాలతో పడివున్న వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం.. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు. ఇక ఏపీ, తాడేపల్లిగూడెం (Tadepalligudem)లో మరో దారుణం చోటు చేసుకుంది.

బైక్‌పై అతివేగంగా వెళుతూ.. ట్రాన్స్‌ఫార్మన్‌ను ఢీకొట్టి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు.. వీరంతా పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోన్న విద్యార్థులుగా గుర్తించారు.. మరోవైపు శనివారం రాత్రి మాధవరం హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఈ ముగ్గురు, విపరీతంగా మద్యం సేవించి వారి ఇళ్లకు అర్ధరాత్రి ఒంటి గంట సమయాంలో బయలుదేరినట్టు సమాచారం..

ఈ క్రమంలో బైక్, మిలటరీ మాధవరం వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ను ఢీకొట్టింది. అయితే స్థానికుల సమాచారంతో మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని.. వెంటనే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరించడం గమనార్హం. చివరికి పోలీసులకు సైతం తెలపకుండా ఇలా చేయడం చర్చాంశనీయంగా మారింది.. ఇలా వేర్వేరు రోడ్డు ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించడం విషాదకరం..

You may also like

Leave a Comment