Telugu News » రజిని కాంత్ రాజమౌళి కాంబో మిస్ అవడానికి… కారణం ఏమిటి..?

రజిని కాంత్ రాజమౌళి కాంబో మిస్ అవడానికి… కారణం ఏమిటి..?

by Sravya

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ అవకాశం రాదు. రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి పెద్ద హిట్ లని ఇచ్చారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ అయింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని రాజమౌళి సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా రజనీకాంత్ కూడా మంచి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తే హిట్ అని ఫ్యాన్స్ అభిప్రాయం.

Rajinikanth counter to ycp

అయితే, వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఒక సినిమా ఇదివరకే రావాల్సి ఉంది కానీ రాలేదు. హీరో రజనీకాంత్ చంద్రముఖి సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికే వరుస హిట్లతో దూసుకువెళ్లి పోతున్న రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ వర్క్ అవుట్ మాత్రం కాలేదు. రాజమౌళి వరుసగా యమదొంగ, మగధీర సినిమాలతో కమిట్ అయి ఉన్నారు. దీంతో రజనీకాంత్ తో సినిమా చేయలేదు.

Also read:

రజనీకాంత్ కనుక రాజమౌళితో సినిమా చేసి ఉన్నట్లయితే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది అని అంతా అంటున్నారు. ఈ కాంబోలో సినిమా అనేది తీసే అవకాశం అయితే రాలేదట. మరి ఇక మీదటైనా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా రాజమౌళి బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు దాని తర్వాత ఒక తెలుగు వాడు సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది ఇండియా వైడ్ గా అందరికీ తెలిసింది.

You may also like

Leave a Comment