Telugu News » Meet Mahaavatar baba : హిమాలయాల్లో కొనసాగుతున్న రజనీ ఆధ్యాత్మిక యాత్ర…!

Meet Mahaavatar baba : హిమాలయాల్లో కొనసాగుతున్న రజనీ ఆధ్యాత్మిక యాత్ర…!

ఓ వైపు థియేటర్లలో జైలర్ జైత్రయాత్ర కొనసాగుతుంటే..మరోవైపు హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది.

by sai krishna

ఓ వైపు థియేటర్లలో జైలర్ జైత్రయాత్ర కొనసాగుతుంటే..మరోవైపు హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. జైలర్(Jailer)సినిమాకి ముందే హిమాలయాలకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)ఇప్పటికే హిమాలయాలు, బద్రీనాథ్ క్షేత్రాన్ని సందర్శించారు.

 

తాజాగా ఉత్తరాఖండ్ అల్మోరాలోని ద్వారహత్(Dwarahat)కు చేరుకున్నారు. అక్కడున్న మహావతార్ బాబా(Mahavatar Baba) గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. యోగదా ఆశ్రమంలోని సాధువులను కలుసుకున్నారు.
మార్గమధ్యంలో ఆయన్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు.

మరుసటి రోజు ఉదయం ఆయన రాంచీకి బయలుదేరారు. బాబా గుహలను సందర్శించిన ఆయన.. ఆ తర్వాత ఝార్ఖండ్(Jharkhand)లోని రాంచీ(Ranchi)కి వెళ్లారు. అక్కడి గవర్నర్‌ సీపీ.రాధాకృష్ణన్ను కలిసి కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను గవర్నర్ రాధాకృష్ణ(Governor Radhakrishna) ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.


“రాంచీకి రజనీ రావడం ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయనను రాజ్‌భవన్‌లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఝార్ఖండ్‌ అనే గొప్ప ప్రదేశానికి ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను” అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment