రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ (Congress) రెడీ అయింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీ (Sonia Gandhi)తో పాటు బీహార్ (Bihar) నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర (Maharashtra) నుంచి చంద్రకాంత్ హండోర్‌ని అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించింది.
కానీ తెలంగాణ అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ నుంచి అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 27వ తేదీన 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ పత్రాల దాఖలుకు రేపే చివరి రోజు. ఇక, బీజేపీ, బీజేడీ, టీఎంసీ సహా పలు పార్టీలు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి.
కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు కేవలం నలుగురిని మాత్రమే ప్రకటించింది. ఇతర అభ్యర్థుల పేర్లపై పార్టీలో మేధోమథనం కొనసాగుతోందని సమాచారం.. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు దక్కనుండగా, వారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు.
అయితే సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఒద్దిరాజు రవిచంద్ర త్వరలో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల్లో ఉన్నారు. వీరిలో రవిచంద్ర పదవీ కాలం రెండేండ్లకే ముగియనుండటంతో ఖాళీ అయ్యే స్థానానికి తననే ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలలో చర్చించుకొంటున్నారు.. ఇక ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు కాలేదు.