Telugu News » MLC Jeevan Reddy : అధికారం పోయిందనే ఆవేశంలో.. అతిగా ప్రవర్తించకండి..!!

MLC Jeevan Reddy : అధికారం పోయిందనే ఆవేశంలో.. అతిగా ప్రవర్తించకండి..!!

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కాళేశ్వరంపై న్యాయ విచారణను బీఆర్ఎస్ (BRS) అడ్డుకోవాలని చూస్తోందని.. ఇందుకు బీజేపీ (BJP) సైతం సపోర్ట్ చేస్తోందని ఆరోపణలు చేశారు.. నేడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ప్రాజెక్ట్ అవినీతిపై జ్యూడీషియల్ ఎంక్వైరీ చాలా పారదర్శకమైనదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు.

by Venu
congress mlc jeevan reddys sensational comments on kcr

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందన్న ఆరోపణలున్నాయి. అయితే వారి విమర్శలకు కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా సమాధానాలు ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక సమయం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ పాలన తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తాజాగా బీఆర్ఎస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కాళేశ్వరంపై న్యాయ విచారణను బీఆర్ఎస్ (BRS) అడ్డుకోవాలని చూస్తోందని.. ఇందుకు బీజేపీ (BJP) సైతం సపోర్ట్ చేస్తోందని ఆరోపణలు చేశారు.. నేడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ప్రాజెక్ట్ అవినీతిపై జ్యూడీషియల్ ఎంక్వైరీ చాలా పారదర్శకమైనదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడిచిందా అని ప్రశ్నించారు.. ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని కూల్చుదామనే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ 420 కేసీఆర్‌, మోసగాడు కేటీఆర్‌ (KTR).. ముందు ఇది గ్రహించండని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవక ముందు నుంచి కొత్త వేషం కట్టి.. హామీలను అమలు చేయలేదంటూ వేస్తున్న గెంతులు ఆపాలని సూచించారు..

ముందు వెనుక ఆలోచించకుండా కాంగ్రెస్‌ను 420 అని కేటీఆర్‌ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడుఎకరాల భూమి ఇస్తానని చెప్పి చేయని కేసీఆర్‌ ని, ఏమంటారని ప్రశ్నించారు. ఇలా మీరు పాలించిన తొమ్మిది సంవత్సరాల పాలనలో, ఎన్నో హామీలు ఆటకెక్కించారని గుర్తు చేసిన జీవన రెడ్డి.. అధికారం పోయిందనే ఆవేశంలో మీ తప్పులు మరచి మాట్లాడటం, మీ స్వార్థ బుద్ధిని తెలియచేస్తుందని అన్నారు..

You may also like

Leave a Comment