అయోధ్య(Ayodhya)లో రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్(Bihar)కు చెందిన కళాకారులు అద్భుతమైన కళాఖండాలు అయోధ్యలో ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ఇక్కడ 14లక్షల దీపాల(14lack Colorful Lamps)తో శ్రీరాముడి కళాఖండాన్ని రూపొందించారు.
ఇది ప్రపంచ రికార్డు నమోదు చేసింది. బీహార్‌కు చెందిన అనిల్ కుమార్ తన 12 మంది సహచరులతో కలిసి ఈ కళాఖండాన్ని రూపొందించారు. దీని పొడవు 250 అడుగులు కాగా వెడల్పు 150 అడుగులు. ఈ కళాఖండాన్ని మొత్తం 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర మంత్రి అశ్విని చౌబే దీని ప్రధాన నిర్వాహకులు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే అభ్యుదయ రథయాత్రతో బీహార్ నుంచి అయోధ్య చేరుకున్నారు. ఆయన కాన్వాయ్‌లో 750కి పైగా వాహనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబురాల్లో వేలాదిమంది పాల్గొననున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని చౌబే నేతృత్వంలోని రాముడి కోసం వందలాది మంది ప్రజలు మిథిలా నుంచి ఇక్కడకు వచ్చారు. చౌబే ఈ రథయాత్రతో బక్సర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అయోధ్య చేరుకున్నారు. బీహార్‌లోని ప్రతీ మత స్థలం నుంచి 2వేల మందికి పైగా ప్రజలు గంగాజలం, ఇతర కానుకలను తీసుకువెళ్లారు.