Telugu News » Narayan Rane : రామమందిరం రాజకీయాల ఆధారంగా నిర్మించలేదు..!!

Narayan Rane : రామమందిరం రాజకీయాల ఆధారంగా నిర్మించలేదు..!!

హిందూ మతానికి శంకరాచార్యులు సహకారం అందించాలని కోరారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన దైవ కార్యం ఆగదని తెలిపారు.. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామమందిరాన్ని ప్రారంభించాలని శివసేన ( UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేయడంపై నారాయణ్ రాణే స్పందించారు.

by Venu

అయోధ్య (Ayodhya) రామ మందిరం గురించి, రామ మందిర ప్రారంభోత్సవం గురించి నలుగురు శంకారాచార్యులు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకామని వెల్లడించిన విషయం చర్చాంశనీయంగా మారింది. వీరి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి (Union Minister) నారాయణ్ రాణే విమర్శలు గుప్పించారు. మంచి కోసం చేస్తున్న పనిని ఆశీర్వదించవలసింది. కానీ ఇలా విమర్శలు చేయడం సరికాదని తెలిపారు..

మహారాష్ట్ర (Maharashtra) పాల్‌ఘర్‌లో విలేకరులతో మాట్లాడిన నారాయణ్ రాణే (Narayan Rane).. రామ మందిరం నిర్మాణాన్ని.. రాములోరీ విగ్రహ ప్రతిష్టాపన వేడుకని శంకరాచార్యులు రాజకీయ కోణంతో చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో, ప్రధాని మోడీ కృషివల్ల ఇంతటి మహత్తరమైన కార్యక్రమం జరుగుతోన్న వేళ ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.. రామమందిరం రాజకీయాల ఆధారంగా కాకుండా మత విశ్వాసాల మీద నిర్మించారని.. రాముడు ఎప్పటికీ మా దేవుడని తెలిపారు.

హిందూ మతానికి శంకరాచార్యులు సహకారం అందించాలని కోరారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన దైవ కార్యం ఆగదని తెలిపారు.. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామమందిరాన్ని ప్రారంభించాలని శివసేన ( UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేయడంపై నారాయణ్ రాణే స్పందించారు. ఉద్యోగం లేని, ఇంట్లో కూర్చున్న వ్యక్తి గురించి తాను మాట్లాడబోనని సమాధానం చెప్పారు.

థాక్రే వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు.. ఇదిలా ఉండగా నారాయణ్ రాణే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే స్పందించారు. హిందూ మతాన్ని, దాని ఆధ్యాత్మిక అధిపతులను నారాయణ్ అవమానించారని విమర్శించారు. ఆయనకు హిందూ మతం గురించి సరిగా తెలియదని విమర్శించారు..

You may also like

Leave a Comment