Telugu News » Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో నిందితుడి అరెస్ట్..!

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో నిందితుడి అరెస్ట్..!

బెంగళూరు(Bengaluru)లోని రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe)లో పేలుడు ఘటన దేశమంతా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐఏ కీలక పురోగతి సాధించింది. కేఫ్‌లో బంబు అమర్చిన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.

by Mano
Rameshwaram Cafe: Accused arrested in Rameshwaram Cafe blast incident..!

బెంగళూరు(Bengaluru)లోని రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe)లో పేలుడు ఘటన దేశమంతా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐఏ కీలక పురోగతి సాధించింది. కేఫ్‌లో బంబు అమర్చిన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

Rameshwaram Cafe: Accused arrested in Rameshwaram Cafe blast incident..!

ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(NIA), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం వెతుకుతూనే ఉన్నాయి.

నిందితులను పట్టించిన వారికి రివార్డు కూడా ప్రకటించాయి. ఎట్టకేలకు బాంబు అమర్చిన నిందితుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సేన్‌గా గుర్తించి అతన్ని ఎన్ఐఏ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. నిశితంగా దర్యాప్తుతో పాటు నిఘా తర్వాత ఎన్ఐఏ అతడిని అరెస్ట్ చేసి ఈ కేసులో విజయం సాధించింది. చాలా నెలలుగా పరారీలో ఉన్న ఉగ్రవాదిని హుస్సేన్‌ను పట్టుకుంది.

పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించారు. మాస్క్ ధరించి నడుస్తున్న కొత్త చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసింది. అందులో టోపీ లేకుండా కొత్త డ్రెస్ లో నిందితుడు కనిపించినా మాస్క్ మాత్రం ఇంకా పెట్టుకునే కనిపించాడు. ఎన్‌ఐఏ అధికారులు అతడిని పట్టుకుని 14రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment