Telugu News » Japan PM: అమెరికా ఒంటరి కాదు.. తోడుగా మేమున్నాం: జపాన్

Japan PM: అమెరికా ఒంటరి కాదు.. తోడుగా మేమున్నాం: జపాన్

అమెరికా ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని, వెంట తామున్నామని భరోసా ఇచ్చారు. ఇటీవల అమెరికా వైట్ హౌస్ పర్యటన సందర్భంగా జపాన్ ప్రధాని అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. 

by Mano
Japan PM: America is not alone.. We are together: Japan

అంతర్జాతీయ వ్యవహారాల్లో కొత్త సవాళ్లు ఎదురువుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా(America) ఎప్పటిలాగే ముందుండి నాయకత్వ పాత్ర పోషించాలని జపాన్ ప్రధాని(Japan PM) ఫుమియో కిషిదా(Fumio Kishida) అభిప్రాయపడ్డారు. ఈ భారాన్ని అమెరికా ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని, వెంట తామున్నామని భరోసా ఇచ్చారు. ఇటీవల అమెరికా వైట్ హౌస్ పర్యటన సందర్భంగా జపాన్ ప్రధాని అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

Japan PM: America is not alone.. We are together: Japan

అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాముఖ్యాన్ని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం చైనాయే అతిపెద్ద భద్రతాపరమైన సవాలు అని తెలిపారు. ఇది జపాన్‌కే కాదు.. అంతర్జాతీయ శాంతి సామరస్యాలకూ చైనా సవాలుగా మారిందని వెల్లడించారు. తప్పదనుకున్న సందర్భాల్లో అమెరికా అనేక త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. తమ దేశంలో పోషిస్తున్న కీలకపాత్రపై అమెరికన్లకు సందేహాలు అవసరం లేదని అన్నారు.

ఈ బాధ్యత నిర్వహిస్తున్నది తమ దేశం ఒక్కటేనన్న నిరాశ, నిస్పృహ కొందరు అమెరికన్లలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాపై ఉన్న ఈ బాధ్యతల భారం పెద్దదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలన్నారు. ఇప్పటికే జపాన్ అమెరికా వెన్నంటి నడుస్తోందని, మీరు ఒంటరి కాదు.. మేమున్నామంటూ భరోసానిచ్చారు.

ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాజం కోసం అమెరికా కొన్ని తరాల పాటు కష్టించిందని, పరిస్థితులు తలకిందులు చేసే తాజాగా సవాళ్లు మొదలయ్యాయని హెచ్చరించారు. అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పరిమితం చేయాలని సొంత వ్యవహారాల వైపు దృష్టి మళ్లించాలని రిపబ్లికన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో జపాన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

You may also like

Leave a Comment