Telugu News » రాజమౌళి కి జగపతిబాబు కి ఉన్న బంధుత్వం ఏమిటి..? ఇద్దరూ ఏం అవుతారు..?

రాజమౌళి కి జగపతిబాబు కి ఉన్న బంధుత్వం ఏమిటి..? ఇద్దరూ ఏం అవుతారు..?

by Sravya

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఒక ఫ్లాప్ కూడా లేకుండా మంచి స్టార్ట్ డైరెక్టర్ గా రాజమౌళి దూసుకు వెళ్ళిపోతున్నారు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోలు కలకంటూ ఉంటారు బాలీవుడ్ తారలు సైతం ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అలానే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడం, ఆ సినిమాలు వేలకోట్ల రూపాయలని కలెక్ట్ చేయడం రాజమౌళికే సాధ్యం.

రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా మనకి పరిచయమే. కార్తికేయ కూడా నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాణి అనే సినిమాని నిర్మించారు. కార్తికేయ గత ఏడాది వివాహం చేసుకున్నారు తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ని కార్తికేయ పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ పూజ ప్రసాద్ ఎవరంటే టాలీవుడ్ లో ఒక హీరోగా వెలుగుంది విలన్ పాత్రలు చేస్తున్న జగపతిబాబు మేనకోడలు.

Also read:

పూజ ప్రసాద్ మంచి సింగర్ ప్రస్తుతం కార్తికేయ రాజమౌళి చేస్తున్న సినిమాలకు సంబంధించిన పనులు దగ్గరుండి ఆమె చూస్తోంది. ఇలా చూసుకున్నట్లయితే రాజమౌళి జగపతిబాబు బంధువులు అవుతారు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉంటారు. కానీ నిజానికి వాళ్లు బంధువులని మనకి తెలీదు. నటుల గా లేదంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లుగా మాత్రమే తెలుసు కానీ బంధువులు అని మనకు తెలియకపోయుండొచ్చు.

You may also like

Leave a Comment