నటి విజయశాంతి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తన నటన తో అందరిని ఫిదా చేసేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో విజయశాంతి కూడా ఒకరు. హీరోల పక్కన జోడి కింద నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది. ఒసేయ్ రాములమ్మ, అడవి చుక్క వంటి సినిమాల్లో విజయశాంతి నటించి, మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పోలీస్ పాత్రలో కూడా విజయశాంతి కనపడి అందరిని ఆకట్టుకునేది.
ఎక్కువగా విజయశాంతి తెలుగు సినిమాలలో బాలకృష్ణ సరసన నటించేవారు. మొట్టమొదట పట్టాభిషేకం సినిమాలో వీళ్లిద్దరు నటించారు తర్వాత చాలా సినిమాల్లో కనపడ్డారు. విజయశాంతి, బాలయ్య ఎక్కువ సినిమాలు నటించడం స్నేహంగా ఉండడం వలన ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరు లవ్ లో వున్నారని అంతా అనుకునే వారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. విజయశాంతి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస ప్రసాద్ ని పెళ్లి చేసుకున్నారు.
Also read:
కానీ ఎప్పుడూ కూడా ఈ జంట మీడియా ముందు కనపడలేదు బాలకృష్ణ కి విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా. బాలయ్యకి శ్రీనివాస్ ప్రసాద్ ప్రాణ స్నేహితుడు. బాలకృష్ణ సలహా మీదకే విజయశాంతిని అయిన పెళ్లి చేసుకున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే విజయశాంతి తన భర్తతో కలిసి ఉంటున్నారా..? వీళ్ళకి పిల్లలు ఉన్నారా అనే విషయాలు కూడా తెలియవు.