Telugu News » Dr Preethi Suicide Case : ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో పీజీ విద్యార్థికి ఊరట.. సస్పెన్షన్‌ రద్దు చేసిన హైకోర్టు..!!

Dr Preethi Suicide Case : ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో పీజీ విద్యార్థికి ఊరట.. సస్పెన్షన్‌ రద్దు చేసిన హైకోర్టు..!!

KMCలో అనస్థీషియా ద్వితీయ సంవత్సరం విద్యార్థి సైఫ్ అలీ అభ్యర్థన మేరకు, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొన్న ర్యాగింగ్ నిరోధక కమిటీ, మళ్లీ విచారణ చేపట్టింది.

by Venu

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో హైకోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ విద్యార్థి సైఫ్ అలీకి ఊరటనిచ్చేలా తీర్పు ఇచ్చింది. గతంలో విధించిన సస్పెన్షన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో పీజీ మొదటి సంవత్సరం చదువుతోన్న ప్రీతి (Preethi) గతేడాది ఆత్మహత్య (suicide) చేసుకొన్న సంగతి తెలిసిందే.

High Court on Tourism: Government's negligence on suspension... High Court is serious..!

సీనియర్ విద్యార్థి వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు సంచలనాన్ని సృష్టించాయి. ఆమేరకు ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణ జరుపుతోన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ (Anti Ragging Committee) కీలక విషయాలను వెల్లడించింది. సైఫ్, ప్రీతిని వేధింపులకు గురిచేసింది నిజమేనని కమిటీ తేల్చింది. ఈ క్రమంలో సస్పెన్షన్ విధించింది. అయితే ఈ ఏడాది మార్చి 3తో ఆ గడువు ముగియడానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో మరో 97 రోజులు పొడిగిస్తున్నట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకొంది. అయితే కమిటీ తీర్మానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు (High Court) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు KMCలో అనస్థీషియా ద్వితీయ సంవత్సరం విద్యార్థి సైఫ్ అలీ అభ్యర్థన మేరకు, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొన్న ర్యాగింగ్ నిరోధక కమిటీ, మళ్లీ విచారణ చేపట్టింది.

ఇందులో నిందితునిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని భావించిన కమిటీ, గత నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ వేటును కోర్టుకు అప్పగించింది. ఈ క్రమంలో కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సైఫ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనను సమర్థించిన కోర్టు.. ర్యాగింగ్ నిరోధక కమిటీ తీర్మానాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది..

You may also like

Leave a Comment