Telugu News » Kangana Ranaut: డేటింగ్ రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌..!

Kangana Ranaut: డేటింగ్ రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌(Bollywood Fire Brand) నటి కంగనా రనౌత్(Actress Kangana Ranaut) ప్రేమలో పడిందని నెట్టింట వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే.కంగనా తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది.

by Mano
Kangana Ranaut: Dating Rumors.. Bollywood fire brand gave clarity..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌(Bollywood Fire Brand) నటి కంగనా రనౌత్(Actress Kangana Ranaut) ప్రేమలో పడిందని నెట్టింట వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా కంగ‌నా ఓ వ్యక్తితో క‌లిసి న‌డుస్తున్న ఫొటోలు కెమెరా కంట పడ్డాయి. దీంతో కంగ‌నా ప్రేమ‌లో ప‌డిందా? ఆ ఫొటోలోని మిస్టరీ వ్యక్తి ఎవరు? అంటూ జ‌నాలు తెగ వెత‌క‌డం మొద‌లుపెట్టారు.

Kangana Ranaut: Dating Rumors.. Bollywood fire brand gave clarity..!

ఇక ఓ ఆంగ్ల పత్రికల్లో కూడా కంగనా లవ్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కంగనా తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ‘నాతో పాటూ కనిపించిన ఈ మిస్టరీ మ్యాన్ ఎవ‌రు అని నన్ను చాలా మంది అడిగారు. కొంత‌ మంది మెసేజ్‌లు, ఫోన్‌లు చేశారు’ అని తెలిపింది.

‘అయితే వీళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. ఆడా, మగా కలిసి కనిపిస్తే చాలు వాళ్లు డేటింగ్‌లో ఉన్నట్లు భావిస్తే ఎలా?’ అని కంగ‌నా ప్రశ్నించింది. ‘వారి మధ్య ప్రేమ కాకుండా అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు. వారు ఫ్రెండ్స్, తోబుట్టువులు, సన్నిహితులు, లేదా ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు..’ అంటూ కంగ‌నా రాసుకోచ్చింది.

దీంతో కంగ‌నాతో ఉంది హెయిర్ స్టైలిస్ట్ అని తెలిసిపోయింది. కంగ‌నా ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ అనే చిత్రంలో న‌టిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్నా ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తోంది.

You may also like

Leave a Comment