Telugu News » వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లకపోవడానికి కారణం అదే.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లకపోవడానికి కారణం అదే.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

by Sravya

రేణు దేశాయ్ మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. రేణు దేశాయ్ పేరు చెప్పగానే మొట్టమొదటి మనకి పవన్ కళ్యాణ్ ఏ గుర్తు వస్తారు. ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలని రేణు దేశాయ్ బయటపెడుతున్నారు. మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర సినిమాతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రేణు దేశాయ్ పాత్రకి మాత్రం గుర్తింపు బానే వచ్చింది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లి కోసమని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటలీ వెళ్లారు.

Renu Desai: Second marriage canceled: Renu Desai

పవన్ కళ్యాణ్ కూడా తన మూడవ భార్య తో కలిసి ఇటలీ వెళ్లారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడటం జరిగింది. మేము వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లడం లేదు అని చెప్పారు. గతంలో నిహారిక పెళ్లికి అకిరా నందన్, ఆద్య ఇద్దరు వెళ్లారని ఆమె చెప్పారు. కానీ ఇప్పుడు వెళ్లట్లేదు. ఇక చిన్నప్పటినుండి వరుణ్ తేజ్ నా కళ్ళ ముందే పెరిగాడని రేణు దేశాయ్ చెప్పారు.

Also read:

 

అతనికి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయని కూడా ఆమె చెప్పారు. ఒకవేళ నేను కనుక పెళ్ళికి వెళ్ళాను అంటే అక్కడ అందరూ అన్ కంఫర్టబుల్గా ఉంటారు అందుకే నేను వెళ్లట్లేదు అని ఆమె చెప్పారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆమెకి ఇన్విటేషన్ అందినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే కొంతమందికి నచ్చదని ఆమె ఆగిపోయారట. మెగా ఫ్యామిలీ లో జరిగే ఫంక్షన్ అన్నింటికీ కూడా అందుకే ఈమె దూరంగా ఉంటున్నారు.

 

You may also like

Leave a Comment