Telugu News » Revanth Reddy: అంతర్జాతీయ దళారుల సంఘం అధ్యక్షులు కేసీఆర్, కేటీఆర్…!

Revanth Reddy: అంతర్జాతీయ దళారుల సంఘం అధ్యక్షులు కేసీఆర్, కేటీఆర్…!

ధరణిని నూటికి నూరు శాతం రద్దు చేస్తామన్నారు.

by Ramu
Revanth reddy fire on kcr family

-కేసీఆర్ కుటుంబానికి ధరణి ఒక ఏటీఎం కార్డు
– వాళ్లు మరిన్ని దోపిడీ పథకాలను అమలు చేయవచ్చు
-ఈ ప్రభుత్వాన్ని బొందపెడతాం
-దానికి ధరణి మొదటి రాయి అవుతుంది
-అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం
– టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

1953లో నెహ్రూ(Nehru) హయాంలో హైదరాబాద్ లో సీడబ్యూసీ(CWC) సమావేశాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. 70 ఏండ్ల తర్వాత హైదరాబాద్ కేంద్రంగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమయంలో తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండటం తాను మరచి పోలేనన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Revanth reddy fire on kcr family

ఈ సమావేశాల్లో కాంగ్రెస్ విధి విధానాలతో పాటు జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించామన్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పోషించాల్సిన పాత్ర, నిర్వహించాల్సిన కార్యక్రమాలను కూడా చర్చించామన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి పాత్ర, కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాల గురించి పూర్తిగా చర్చించామన్నారు.

అనంతరం తుక్కుగూడలో నిర్వహించిన విజయ భేరికి సోనియా సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఇందులో ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఆమె అందించారన్నారు. ఈ ఆరు హామీలను అభయ హస్తం పేరిట సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీలు గ్యారెంటీ ఇచ్చిరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలం ఇక మిగిలింది 100 రోజులేనన్నారు.

2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ఏర్పాటుకు మాటిచ్చారని అన్నారు. ఆ తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరకు తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. అలాంటి సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు ఆమెను గౌరవించి వుంటే బీఆర్ఎస్ కు రాజ విజ్ఞత ఉందని ప్రజలు భావించే వారన్నారు.

అలా చేయకపోగా కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలు సోనియాపై విమర్శలు చేశారన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వుంటే ఇలా ఎందుకు చించుకుని కాంగ్రెస్ పై ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న మూడు పార్టీలు నిన్న బయటకు వచ్చి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించాయన్నారు.

పంపకాలప్పుడు మాత్రమే ఆ మూడు పార్టీలు వేరన్నారు. కానీ కాంగ్రెస్ పై విమర్శలప్పుడు మూడు పార్టీలు ఒక్కటేన్నారు. కాంగ్రెస్ ను నిలువరించేందుకు ఆ మూడు పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తన స్వప్నమని సోనియా గాంధీ చెప్పారని గుర్తు చేశారు.

2004 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పామన్నారు. అన్నట్టుగానే మొదటి రోజే సంతకం పెట్టామన్నారు. రూ. 1253 కోట్ల అప్పులు రద్దు చేశామన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇచ్చామన్నారు. ప్రతి పేదవాడికి ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించామని పేర్కొన్నారు.

ఏ రాష్ట్ర నైసర్గిక స్వరూపం ఆదారంగా అవసరాలు మారుతాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి, అక్కడి ప్రజలకు ఏది ఇస్తే మేలు జరుగుతుందో అది మాత్రమే అందిస్తామన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎర్రి మాటలు మాట్లాడితే ప్రజలు చీరి చింతకు కడుతారని ఆయన హెచ్చరించారు.

తెలంగాణలో ప్రతి పోరాటం భూమి కోసం జరిగిందన్నారు. ఇప్పుడు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు ధరణి మొదటి రాయి అవుతుందన్నారు. అంతర్జాతీయ దళారుల సంఘం అధ్యక్షులే కేసీఆర్ కేటీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి ధరణి పథకం ఏటీఎం లాంటిదన్నారు. ధరణిని నూటికి నూరు శాతం రద్దు చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం మరి కొన్ని దోపిడీ పథకాలు అమలు చేయవచ్చన్నారు.

You may also like

Leave a Comment