కాంగ్రెస్ (Congress) పార్టీలో వైఎస్ఆర్ టీపీ (YSRTP) విలీనంపై వేగంగా కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే సోనియా గాంధీ(Sonia Gandhi) , రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో ప్రత్యేకంగా భేటీ అయిన షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే వైఎస్ఆర్ చరిష్మా పనికి వస్తుందంటూ అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పడంతో వైఎస్ఆర్ టీపీ విలీనంపై అన్ని విధాలుగా అధిష్టానం సుముఖంగా ఉంది.
అయితే షర్మిల తెలంగాణలో పని చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ససేమిరా అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిల (YS Sharmila)ను పార్టీలో చేర్చుకుంటే 2018 ఎలక్షన్ రిపీట్ అవతుందని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. షర్మిల అంశంలో మొదటి నుంచి మధ్యవర్తిత్వానికే డీకే శివకుమార్ ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ సందేహాలను నివృత్తి చేస్తూ అధిష్టానం ఆలోచనలను వివరించినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ లో షర్మిల కల్లోలం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ షర్మిల మొదలు పెట్టారు. షర్మిల పార్టీ విలీనం దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి. షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ (DK Siva Kumar) కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యతను అధిష్టానం డీకే శివకుమార్ కు అప్పగించించింది. శుక్రవారం డీకే శివకుమార్ తో రేవంత్ భేటీ అయ్యారు.
కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంపై బెంగళూరులో కీలక భేటీ అయ్యారు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చర్చల్లో పాల్గొననున్నారు. అయితే, తెలంగాణలోనే రాజకీయం చేయాలనే యోచనలో షర్మిల ఉన్నారు. కానీ, తెలంగాణలో షర్మిల రాజకీయం చేయడాన్ని రేవంత్ రెడ్డి నిరాకరిస్తున్నారు.