Telugu News » Revanth Reddy : దావోస్ వేదికగా మొదలైన వార్.. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్..!

Revanth Reddy : దావోస్ వేదికగా మొదలైన వార్.. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్..!

ముందుగా వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు.. బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను అనేక మందిని చూసిందని తెలిపారు.

by Venu
davos

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి బీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అయితే అదే సమయంలో కేసీఆర్ అనారోగ్యం బారినపడటం వల్ల ప్రతిపక్షంగా మారిన గులాబీలో పట్టు లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న పెద్ద సారు పై చిన్న సారు.. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

congress-leaders-are-criticizing-brs-leaders

ఈ మాటలపై కేటిఆర్‌ (KTR)కు, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పులి బయటికి వస్తే బోన్ వేసి చెట్టుకు వేళాడదీస్తామని కౌంటర్ వేశారు.. లండన్‌లో పర్యటిస్తున్న సీఎం.. అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) చుద్దామన్నా కనిపించదని వ్యాఖ్యానించారు..

ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్న రేవంత్ రెడ్డి.. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనన్న అభిప్రాయానికి వచ్చారు.. అయితే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నేడు తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందామని అన్నారు..

ముందుగా వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు.. బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను అనేక మందిని చూసిందని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించినందుకు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చింనందుకు, బీఆర్ఎస్‌ను బొంద పెడుతావా? అంటూ మండిపడ్డారు..

You may also like

Leave a Comment